28-11-2025 12:06:25 AM
జిల్లా పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం
నిర్మల్, నవంబర్ 2౭ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో మూడు దశల్లో నిర్వహించబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబం ధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే ప్రజలు తమను సంప్రదించవచ్చునని జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం తెలిపారు. గురువారం జిల్లాకు వచ్చిన ఆమెను కలెక్టర్ అభిలాష అభినవ్ స్వాగతం పలికి, ఎన్నికల నిర్వహణపై చర్చించారు.
పట్టణంలోని అటవీ శాఖ వసతి గృ హంలో తాము అందుబాటులో ఉంటామని, ఎన్నికలపై ఫిర్యాదులను ఇవ్వాలనుకున్నవారు నేరుగా సంప్రదించి, ఫిర్యాదులు ఇవ్వవచ్చన్నారు. లేదా 9959284786 ఫోన్ నెంబర్ ద్వారానైనా ఫిర్యాదులపై సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. observergpnirmal@ gmail.com మెయిల్ ఐడి ద్వారానైనా ఫిర్యాదులను వ్యక్తపరచవచ్చునని వివరించారు.
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఫిర్యాదులను నిర్భయంగా ఇవ్వవచ్చునని జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల పరిశీలకులు తెలిపారు ఆమెను జిల్లా కలెక్టర్ అభిలాష అభినందన తో పాటు సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ వేరువేరుగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.