calender_icon.png 15 October, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెస్ట్ అవైలబుల్ పాఠశాలల విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

14-10-2025 10:28:30 PM

పి ప్రావీణ్య, జిల్లా కలెక్టర్..

బెస్ట్ అవైలబుల్ పాఠశాలల విద్యార్థుల సంక్షేమంపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్..

సంగారెడ్డి (విజయక్రాంతి): బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య(District Collector P Pravinya) అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు బెస్ట్ అవైలబుల్ పాఠశాలలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా నుండి కలెక్టర్ పి ప్రావీణ్య, సంక్షేమ శాఖల అధికారులు ఈ వీ.సీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం కింద ఎంపిక చేసిన పాఠశాలలో చదివే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థుల సంక్షేమంపై ఆయా జిల్లాల కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, విద్యార్థులకు అందిస్తున్న బోధన, ఆరోగ్యం, మెనూ ప్రకారం భోజనం, ఇతర మౌలిక వసతుల అమలుపై పాఠశాలలను సందర్శించి పరిశీలించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్, అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల విద్యార్థుల సంక్షేమం, సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి పాఠశాలలో సమగ్రమైన విధంగా ఉన్నారని నిర్ధారించుకోవాలని, సమస్యల పరిష్కారంపై పాఠశాల యాజమాన్యాలతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని, విద్యా సంవత్సరంలో విద్యాబోధనలో ఎలాంటి ఆటంకం రాకుండా ఉండాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.