calender_icon.png 13 December, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతన సర్పంచ్ ల సందడి

13-12-2025 05:57:37 PM

కోలాహాలంగా మారిన ప్రజాభవన్..

సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు..  

మణుగూరు (విజయక్రాంతి): పట్టణంలోని పినపాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం(ప్రజాభవన్) లో నూతన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులతో శనివారం సందడి నెలకొంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుండి అశ్వాపురం, మణుగూరు, పినపాక, బూర్గంపాడు మండలాలలో గెలుపొందిన నూతన సర్పంచులు, ఉపసర్పంచ్ లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్దఎత్తు న ప్రజా ప్రతనిధులు ఎమ్మెల్యే ఆశీస్సుల కోసం తరలిరావడంతో క్యాంప్ కార్యాలయం కోలాహాలంగా మారింది. పలువురు సర్పంచు, ఉప సర్పంచ్ లు శాలువ, పుష్పగుచ్ఛం అందజేసి ఎమ్మెల్యేను సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన విజేతలతో సుదీర్ఘంగా మాట్లాడి, వారి విజయాన్ని అభినందించారు. ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు తమ గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని, అందుకు ఎన్నికైన ప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే దశ నిర్దేశం చేశారు. ఈ సలహాలు విజేతలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యక ర్తలు పాల్గొన్నారు.