calender_icon.png 5 August, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది విరామం మాత్రమే..

05-08-2025 12:33:46 AM

  1. బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుంటే రణరంగమే
  2. ముస్లింలకు ప్రత్యేక బిల్లు పెట్టండి
  3. ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత అల్టిమేటం
  4. హైకోర్టు ఆదేశాలతో 72 గంటల దీక్ష విరమణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి)/ముషీరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు క ల్పించకపోతే తెలంగాణలో రణరంగాన్ని సృష్టిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీ ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ర్ట ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇది రాజకీయ పోరాటం కాదని, బీసీల ఆత్మగౌరవ పోరాటమని ఆమె స్పష్టం చేశారు.

బీసీ రిజర్వేషన్ల బిల్లులో ముస్లింలకు వాటా ఉందనే సాకుతో బీజేపీ దానిని అడ్డుకుంటున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బిల్లు పెట్టి స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ సాధన కోసం సోమవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కవిత తలపెట్టిన 72 గంటల నిరాహార దీక్షకు ప్రభుత్వం అడ్డుతగలడంతో, ఆమె హై కోర్టును ఆశ్రయించారు.

అయితే, కోర్టు పూర్తిస్థాయిలో అనుమతి ఇవ్వకపోవడంతో న్యా యస్థానం ఆదేశాలను గౌరవిస్తూ సోమవారం సాయంత్రం దీక్షను విరమించారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆమెకు మద్దతు తెలిపారు. హర్యానాకు చెందిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్  ఐఎన్‌ఎల్‌డీ నాయకుడు అర్జు న్ సింగ్ చౌతాలా దీక్షకు హాజరై సంఘీభావం ప్రకటించారు.

దీక్షను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఇది కేవలం విరామం మాత్రమేనని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం మా పోరాటం ఆగదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీసీలను మోసం చేస్తున్నాయ ని ధ్వజమెత్తారు. “కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవాలని కాంగ్రెస్ చూస్తుంటే, ఇది రాష్ట్రానికి సంబంధించిన బిల్లు అని బీజేపీ పట్టించుకోవడం లేదు,” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

“బీసీ రిజర్వేషన్లలో ముస్లింల వాటా ఉందని బీజేపీ అం టోంది. కాబట్టి సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇవ్వా లి. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు పెడతామని ప్రకటించాలి. అప్పుడు కూడా బీజేపీ సంతకం చేయక పోతే, ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తాం,” అని కవిత సవాల్ విసిరారు. ఎన్నికల నిర్వహణకు తొం దర ఏముందని కవిత ప్రశ్నించారు. “అర్జెంట్‌గా ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏముం ది? రెండేళ్లుగా సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారా? బీసీలకు రిజర్వేషన్లు సాధించాకే ఎన్నికలు పెట్టండి.

గతంలో తమిళనాడులో బీసీల హక్కుల కోసం తొమ్మిదేళ్లు ఎన్నికలు ఆపారు. మనమేం తక్కువ?” అని ఆమె వ్యా ఖ్యానించారు.  ప్రభుత్వంలో ఉన్నవాళ్లు రాష్ర్టపతి వద్దకు వెళ్లి ఒత్తిడి తేవాలని, ఆర్డినెన్స్‌ను తొక్కిపెట్టిన గవర్నర్‌పై సుప్రీంకోర్టులో కేసు వేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివే దిక గురించి విలేకరులు అడగ్గా, అది కేవలం ప్రజల దృష్టిని మళ్లించే రాజకీయమని కవిత కొట్టిపారేశారు. “అది కాంగ్రెస్ పార్టీ కమిషన్. ప్రాజెక్టులో అత్యధిక టెండర్లు దక్కించుకున్న మేఘా కృష్ణారెడ్డిని ఎందుకు విచారించలేదో చెప్పాలి” అని ఆమె ప్రశ్నించారు.