calender_icon.png 15 August, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

శరవేగంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు

15-08-2025 12:45:21 AM

 కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి 

నిజామాబాద్, ఆగస్టు 14:(విజయ క్రాంతి ):  జిల్లాలో రెండు పడక గదుల (డబుల్ బెడ్ రూమ్) ఇళ్ళను అర్హులైన లబ్దిదారులకు కేటాయించేలా శరవేగంగా ప్రక్రియ చేపడుతున్నామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖల అధికారులు గురువారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పవన్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, రోడ్లు  భవనాల శాఖ డీ.

ఈ రంజిత్, హౌసింగ్ అధికారి నివర్తి తదితరులు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి ఆనుకుని నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ సముదాయాన్ని సందర్శించారు. అందుబాటులో ఉన్న వసతులు, సదుపాయాలను పరిశీలించి, స్థానికంగా నెలకొని ఉన్న స్థితిగతులను కలెక్టర్ దృష్టికి తెచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐ.డీ.ఓ.సీ పక్కన, నాగా రం ప్రాంతాలలో గల 900 డబుల్ బెడ్ రూమ్ లను లబ్దిదారులకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా అర్హులను గుర్తించి ఆమోదం నిమిత్తం జిల్లా ఇంచార్జి మంత్రికి లబ్దిదారుల జాబితా పంపుతామని అన్నారు.

ప్రధానంగా ఇల్లు, నివేశన స్థలం లేని నిరుపేద కుటుంబాలు, సఫాయి కర్మచారీలు, వితంతు వులు, ఒంటరి మహిళలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపు విషయమై ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు అందాయని, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.