15-08-2025 12:44:33 AM
మహబూబాబాద్, ఆగస్టు 14 (విజయ క్రాంతి): కెనరా బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యతగా శిక్షిత్ భారత్, వికసిత్ భారత్ లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే ఎస్సీ , ఎస్టీ విద్యార్థినీలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు అమనగల్ కెనరా బ్యాంక్ మేనేజర్ అజ్మీర జగన్, ఫీల్ ఆఫీసర్ కొడారి శరత్ చంద్ర వెల్లడించారు.
అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన షెడ్యూల్ ట్రైబ్ విద్యార్థినిలు ధరావత్ నవ్య, అజ్మీర్ నిహారిక, బాదావత్ మేఘన, బానోత్ ఝాన్సీ, భూక్య కావ్య, బాదావత్ అనూష లు ఎంపికైనట్లు ప్రకటించారు. ఆరు, ఏడు తరగతుల విద్యార్థినిలకు 3 వేల రూపాయల చొప్పున 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు 5 వేల రూపాయలు చొప్పున 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందించనున్నట్లు తెలిపారు.
ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి కెనరా బ్యాంక్ వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తుందని తెలిపారు. కెనరా బ్యాంకు విద్యా జ్యోతి పథకాన్ని అమలు చేయడానికి తమ పాఠశాల విద్యార్థులను ఎంచుకున్నందుకు, కెనరా బ్యాంక్ అధికారులకు హెడ్మాస్టర్ నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు.