31-08-2025 12:20:28 AM
హైదరాబాద్, ఆగస్టు ౩౦ (విజయక్రాం తి): డీఎస్సీ స్పోర్ట్స్ కోటాకు అర్హులైన వారికి కొలువులు రాలేదని, ప్రాధాన్యక్రమంలో తక్కువ మెరిట్ ఉన్న వారికి కూడా కొలువులు ఇచ్చారని స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమకు న్యా యం చేయాలని తొమ్మిది నెలలుగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీతో పాటు విద్యాశాఖను కోరుతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే తాము పాఠశాల విద్యాశాఖకు రీవెరిఫికేషన్ జాబితాను పంపామని స్పోర్ట్స్ అథారిటీ అంటుంటే, విద్యాశాఖ మా త్రం తమకు అందిన జాబితా ప్రకారమే అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చామని జవాబు ఇస్తున్నదని వెల్లడిస్తున్నారు.
అర్హులను పక్కనబెట్టి..
గతేడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం 11,062 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిలో స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం రిజర్వేషన్ కింద 95 పోస్టులు ఉన్నా యి. దరఖాస్తులకు స్పోర్ట్స్ కోటాలో జీవో నంబర్ 74లోని 1 ఆర్డర్ ప్రకారం ఎంపిక విధానం ఉంటుందని సర్కార్ ప్రకటించింది. స్పోర్ట్స్ కోటాకు రాష్ట్రవ్యాప్తంగా 8 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం డీఎస్సీ నిర్వ హించి ఆగస్టులో పరీక్షలు పూర్తి చేసింది. ఫలితాలను సెప్టెంబర్ 30న వెల్లడించింది.
అక్టోబర్ 6 వరకు 1:3 సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టింది. ఫలితాల ప్రకటన తర్వాత స్పోర్ట్స్ కోటాలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ బాధ్యతలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి ప్రభు త్వం అప్పగించింది. అక్టోబర్‌లో అధికారు లు 393 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. స్పోర్ట్స్‌కోటాలో 95 పోస్టులకు దాదాపు 33 మంది అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చారు. అభ్యర్థులు లేరని మిగిలిన పోస్టుల ను ఓపెన్ కోటాలో ఉంచారు. స్పోర్ట్స్ కోటా ను ఓపెన్ కేటగిరీలో పెట్టడాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు.
జీవో ప్రకారం అర్హులైన వారికి ఉద్యోగాలివ్వలేదని ఆరోపిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో జాతీయస్థాయి క్రీడాకారులు న్నా వారికి కొలువులు ఇవ్వలేదని, కొన్నిచోట్ల రాష్ట్రస్థాయి క్రీడాకారులకూ ఉద్యో గాలిచ్చారని ఆరోపిస్తున్నారు. నియామకా ల్లో అక్రమాలు జరిగాయని, అర్హులైన వారికి ఉద్యోగాలివ్వకుండా అనర్హులకు ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభు త్వం గతేడాది నవంబర్ 20, 21, 22వ తేదీ ల్లో రెండోసారి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను చేపట్టారు.
అలా కూడా స్పష్టత రాకపోవడంతో ఈఏడాది జనవరి 3, 4వ తేదీల్లో మూడోసారి ఉన్నతాధికారులే సర్టిఫికెట్ వెరిఫికేష న్‌ను చేపట్టారు. అలా మూడు సార్లు వెరిఫికేషన్ చేపట్టికూడా ఇప్పటివరకు తుది నివేది కను బయటపెట్టేదు. అంతర్జాతీయ, జాతీ య, రాష్ట్ర, జిల్లాస్థాయి ఇలా ఆర్డర్ ప్రకార మే ఉద్యోగాలిస్తామని, గతేడాది నవంబర్ 30వ తేదీ వరకు జాబితాను విడుదల చేస్తామని నాటి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడా హోదాలోకి నవీన్ నికోలస్ వచ్చారు. దీంతో తమ సమస్య మళ్లీ మొదటికి వచ్చిందని అభ్యర్థులు వాపోతున్నారు.
న్యాయసలహా తీసుకుంటున్న అధికారులు
స్పోర్ట్స్ కోటా విషయమై న్యాయ సలహాను తీసుకుంటున్నట్లు పాఠశాల విద్యాశా ఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఇటీవల ప్రకటించారు. ఈమేరకు అడ్వొకేట్ జనరల్‌కు లేఖ రాశామని స్పష్టం చేశారు. అలాగే త్వరలో రాష్రప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించి, ఏం చేయాలనే అంశంపై యోచిస్తామని వెల్లడించారు.
మరోవైపు ఈ అంశంలో పాఠశా ల విద్యాశాఖ అధికారులు చేసేదేమీ లేదని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. స్పోర్ట్స్ అథారిటీ ఎంపిక చేసిన జాబితా ప్రకారం నియామక పత్రాలు విద్యాశాఖ అధికారులు ఇస్తారని, తమ చేతిలో ఏం లేదని ఓ అధికారి చెప్పడం గమనార్హం.
స్థానిక సంస్థలకు ముందే ఇవ్వాలి..
స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లో నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగింది. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో క్రీడలు ఆడినవారికి ప్రాధాన్య క్రమంలో ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, ప్రభు త్వం అడ్డగోలుగా ఉద్యోగాలిచ్చింది. కొన్ని జిల్లాల్లో జాతీయ స్థాయిలో ఆడిన వారికి, కాకుండా రాష్ట్రస్థాయి క్రీడా కారులకు, కొన్నిజిల్లాల్లో అంతర్జాతీయ, జాతీ య, రాష్ట్రస్థాయి క్రీడాకారులను పక్కనపెట్టి జిల్లా స్థాయి క్రీడలు ఆడిన వారికి పోస్టింగ్ ఇచ్చింది. ఇదే విషయంలో గతంలో మేం హైకోర్టును ఆశ్రయిం చాం.
కోర్టు ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోలేదు. మా జీవితాలను వారు తేలిగ్గా తీసుకుంటున్నారు. స్థానిక సంస్థ ఎన్నికలకు ముందే సర్కారు అర్హులందరికీ కొలువులు ఇవ్వాలి. లేకుంటే రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులందరినీ ఏకం చేసి ఉద్యమం ఉధృతం చేస్తాం.
ఆర్.రమేష్, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థి