calender_icon.png 31 August, 2025 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీలో ప్రతిపక్షం పీపీటీ ఇచ్చే సంప్రదాయం లేదు

31-08-2025 12:20:49 AM

అప్పుడు మేం అడిగినా ఎందుకివ్వలేదు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి ): అసెంబ్లీలో ప్రతిపక్షాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ఇచ్చే సంప్రదాయం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో తాము పీపీటీకి అవకాశం ఇవ్వాలని లేఖ ఇచ్చామన్నారు. శనివారం అసెంబ్లీ లాబీలో మీడి యాతో భట్టి విక్రమార్క చిట్‌చాట్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీపీటీకి అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ నేతల విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం స్పందించారు.

ప్రతిపక్ష పార్టీకి పీపీటీకి అవకాశం ఇవ్వాలని కోరితే అప్పుడు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. అప్పుడు లేని సంప్రదాయం ఇప్పుడు ఎలా ఉంటుందని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వం రూ.6,500 కోట్ల వడ్డీ చెల్లించడం లేదని బీఆర్‌ఎస్ చేసే వాదన సరికాదని, మరి వడ్డీలు వాళ్లు కడుతున్నారా అని నిలదీశారు.