calender_icon.png 8 January, 2026 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు లక్ష్యంతో చదువాలి

03-01-2026 08:57:22 PM

రైల్వే సర్కిల్ ఇన్స్ పెక్టర్ సురేష్ గౌడ్

కేసముద్రం,(విజయక్రాంతి): చదువుతోనే మన తలరాత మారుతుందని, లక్ష్యంతో చదివితే బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకోవచ్చని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బుర్ర సురేష్ గౌడ్ అన్నారు. కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన 120 మంది విద్యార్థులకు బుర్ర సాయిలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్పోర్ట్ డ్రెస్ ల పంపిణి చేశారు.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాల హెచ్.ఎం చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిధి రైల్వే సర్కిల్ ఇన్స్ పెక్టర్ బుర్ర సురేష్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యంతో చదువాలని ఎన్ని కష్టాలు ఎదురైనా, అనుకున్నది సాధించే వరకు ముందుకు సాగాలన్నారు. గ్రామంలో విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ అందేలా గ్రామంలోని ప్రభుత్వ ఉద్యోగులం కృషి చేస్తామన్నారు.