03-01-2026 08:53:34 PM
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): మండలంలోని రంగపేట గ్రామంలో మేదరి సంఘం ఆధ్వర్యంలో జన్నారం లో ఈనెల 11న మేదరి కుల దైవమైన కంకాలమ్మ జాతర కరపత్రాలను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మేదరి సంఘం అధ్యక్షులు కోడిజుట్టు స్వామి మాట్లాడుతూ.. జాతరకు కులమతాలకు అతీతంగా ప్రతిఒక్కరు వచ్చి కంకాలమ్మ ఆశీస్సులను పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కోడిజుట్టు లచ్చన్న, చెర్ల బక్కన్న, మామిడిపల్లి అంకయ్య, చెర్ల నర్సయ్య,పిల్లి కిష్టయ్య, కోడిజుట్టు మల్లేష్, కోడిజుట్టు బుమయ్య మామిడిపల్లి సారయ్య, చుక్కన్న, రమేష్, తదితరులు పాల్గొన్నారు.