14-05-2025 12:00:00 AM
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన నోట్ ప్రకారమే ఇంకా రూ.4వేల కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉందని హరీశ్‌రావు అన్నారు. 48 గంటల్లో ధాన్యం డబ్బులు వేస్తామని చెప్పిన మీకు ఇది కనిపించడం లేదా..? మిగతా 4వేల కోట్లు రైతులకు ఎప్పుడు చెల్లిస్తారని ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
సన్నవడ్లకు చెల్లించాల్సిన బోనస్ రూ.767 కోట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఒప్పుకున్నారని, ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇప్పటికైనా కళ్లు తెరుచుకొని కాకిలెక్కలు చెప్పడం మాని కల్లాల్లోనే ప్రాణాలు కోల్పోతున్న రైతుల గురించి ఆలోచించండి అన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించి, ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగేలా చూడాలన్నారు. చనిపోయిన రైతులకు 25లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.