16-08-2025 05:03:01 PM
బెజ్జంకి: మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామంలోని ధ్యాననిష్ఠ ఆశ్రమ వ్యవస్థ కులు శ్రీ శ్రీ దయానందగిరి ఆశ్రమంలో ఆశ్రమ ప్రధాన పూజారి భద్రయ్య,కాచ వెంకటేశం ఆధ్వర్యంలో శనివారం శ్రీ కృష్ణాష్టమి వేడుక నిర్వహించారు. విష్ణు సహస్రనామళి, భగవద్గీత లలితా సహస్రనామాలు పంచామృత, పలాభిషేకంతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు . స్వామివారిని తులసీమలతో అలంకరించారు. 1108 శ్రీకృష్ణ శతనామాలతో అర్చన చేశారు. భక్తులు తీర్థ ప్రసాదం స్వీకరించి అన్న ప్రసాద వితరణ చేశారు.