16-08-2025 06:16:22 PM
జుక్కల్ (విజయక్రాంతి): జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు(Koulas Nala Project)లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎగువ భాగం నుంచి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 458 మీటర్లకు గాను ప్రస్తుతం 456. 40 మీటర్లుగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. నీటి కెపాసిటీ 1.237 సీఎం టీఎంసీలకు గాను 0.880 టీఎంసీలుగా ఉన్నట్లు చెప్పారు. భాగం నుంచి ఇన్ ఫ్లో 1851 క్యూసెక్కులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఔట్ ఫ్లో ప్రధాన గేట్ల ద్వారా గాని కెనాల్లో ద్వారా గాని ఎటువంటి నీటి విడుదల చేయడం లేదని చెప్పారు.