calender_icon.png 16 August, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

16-08-2025 06:14:56 PM

చేర్యాల, మద్దూర్ మండలాల్లోని లోలెవల్ వంతెనల పరిశీలన

అధికారులకు తగు సూచనలు చేసిన కలెక్టర్

చేర్యాల: అధిక వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చేర్యాల మద్దూర్ మండలాల్లో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే. హైమావతి ఆకస్మిక పర్యటన చేశారు. చేర్యాల మండల కేంద్రం నుండి కడవెరుగు గ్రామ పరిధిలో గల రోడ్డు వెంబడి ఉన్న లోలెవెల్ వంతెనలు చేర్యాల నుండి మద్దూరు మండలంలోని వల్లంపట్లకు వెళ్లే మార్గంలో గాగిల్లాపూర్ గ్రామ పరిధిలో గల లోలెవెల్ వంతెనలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు వంతెన పైనుండి పోయిన యెడల ఎదుర్కోవాల్సిన చర్యలపైన అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

వాతావరణ శాఖ సూచించిన విధంగా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు ఎల్లపుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఒక వేళ లోలెవెల్ వంతెనపై నుండి నీరు అధికంగా ఉద్రుతంగా వెళుతున్న క్రమంలో రాకపోకలు నిలిపివేసి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలు అతి ముఖ్యమని తరచు పోలీస్ పికెటింగ్ సైతం చేయాలని పోలీసు అధికారులకు ఎల్లప్పుడూ మానిటర్ చేయాలని రెవెన్యూ అధికారులు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.అలాగే వంతెనల కింద కాలువల్లో చెత్తాచెదారం తొలగించాల్సిందిగా ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.