calender_icon.png 16 August, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోర్లం ఆది బసవేశ్వర ఆలయంలో అన్న పూజ చేసిన గ్రామస్తులు..

16-08-2025 05:02:15 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బొర్లం ఆది బసవేశ్వర ఆలయం(Adi Basaveshwara Swamy Temple)లో శ్రావణమాసం చివరి శనివారం రోజు కావడంతో బసవేశ్వర జాతరను పురస్కరించుకొని ఆలయంలోని గర్భగుడిలో శివలింగానికి ప్రత్యేక అన్న పూజ కార్యక్రమం చేపట్టారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మంగళ హారతులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో బోర్లం సొసైటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి దేవేందర్ రెడ్డి, సాయిలు గ్రామ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.