calender_icon.png 17 August, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధారి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

16-08-2025 06:23:33 PM

జిల్లా అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్..

గాంధారి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని సూచించిన నేపథ్యంలో గాంధారి మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్(District Additional Collector Chander Nayak) అన్నారు. ఈ మేరకు శనివారం రోజున మండలంలోని తిప్పారం, పెద్ద గుజ్జుల్ తాండ వాగులు పొంగి పోర్లడం తో ఆ వాగులను జిల్లా పంచాయతీ అధికారి మురళితో కలిసి వాగులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వాగులు ప్రమాద భరితంగా బ్రిడ్జిలపై నుండి పారుతుండడంతో ఇరు గ్రామాల ప్రజలకు సిబ్బంది అప్రమత్తంగా ఉంచి రాకపోకలు కొనసాగించవద్దని సూచించారు. పూర్తిగా ప్రవాహం తగ్గిన తర్వాతనే రాకపోకలు కొనసాగించాలని ఆయన సిబ్బందికి సూచనలు చేశారు. ఈయన వెంట ఎంపీడీవో రాజేశ్వర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.