calender_icon.png 17 August, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాడువాయిలో భారీ వర్షం

16-08-2025 06:35:41 PM

ఉప్పొంగి ప్రవహిస్తున్న భీమేశ్వర వాగు

తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో శనివారం వాగులు, వంకలు, ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాడువాయి మండలంలోని సంతాయిపేట, భీమేశ్వర వాగు,ఎర్రపహాడ్ పెద్ద వాగు, కాలోజివాడి వాగు, నందివాడ పిల్ల ఒర్రె వాగు, దేమి, కన్కల్ వాగులు, ఉధృతంగా ప్రవహిస్తున్నాయి భీమేశ్వర వాగు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఆనుకొని ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వాగు అవతలకు వెళ్లిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులను హెచ్చరించారు. రైతులు వేసుకున్న మొక్కజొన్న,పత్తి పంటలు, జలమయమయ్యాయి. పంటలకు బారి నష్టం వాటిల్లింది. అధికారులు స్పందించి పంటల నష్టం తీరును పరిశీలించాలని రైతులు కోరుతున్నారు.