calender_icon.png 17 August, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందవెల్లి–బట్టుపల్లి రహదారిపై గ్రామస్తుల ఆందోళన

16-08-2025 06:19:20 PM

కాగజ్ నగర్ (విజయక్రాంతి): కాగజ్ నగర్ మండలంలోని అందెల్లి నుండి బట్టుపెల్లి రహదారిపై గ్రామస్థులు ధర్నా చేశారు. శనివారం గ్రామస్తులు ముండ్ల కంచె వేసి రాకపోకలు నిలిపివేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ, రహదారి అధ్వానంగా మారిందని, పలుమార్లు మరమ్మత్తులు చేయాలని అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ స్పందన కరువైందన్నారు. మరమ్మతులు చేసేంతవరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని గ్రామస్తులు తేల్చి చెప్పారు. కాగజ్ నగర్ రూరల్ సీఐ స్వామి కుమార్(CI Swamy Kumar), ఎస్సై సందీప్ కుమార్, ఎంపీడీవో ప్రసాద్ గ్రామస్తులను సముదాయించినప్పటికీ ససే మీరా అన్నారు. రహదారి మరమ్మతులు చేస్తామంటూ స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.