calender_icon.png 24 November, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నుల పండువగా శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

11-02-2025 12:00:00 AM

హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు

యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): పాతగుట్ట శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్స వాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. వారం రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రతిరోజు వందల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు.

బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన సోమవా రం నాడు ఆలయంలో నిత్యారాధనల అనంతరం పారాయ ణకులచే నిత్య ప్రబంధం పారాయణాలు మూల మంత్ర మూర్తి మంత్ర జపములు శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ జపము లు జపించారు. అనంతరం తిరుమంజన ఉత్సవం జరిపి కళ్యాణమూర్తులైన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని అలంక రించి హనుమంత వాహన సేవలో అంగరంగ వైభవంగా ఆలయ ప్రధాన అర్చకులు, ఉపప్రధాన అర్చకులు, యజ్ఞా చార్యులు, వేద పండితులు, పారాయణుకులు.

ఊరే గింపు సేవ నిర్వహించారు. వందలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సర్వోత్తమ గుణములు కలిగిన హనుమంతుడు శ్రీరాముని కళ్యాణ గుణములను కీర్తించి తధాత్మియమును పొంది సకల లోకాలకు గుణాతితు డయ్యాడని అర్చకులు వివరించారు.

హనుమ ద్వాహన సేవ లో స్వామి వారిని దర్శించిన సకల దుఃఖములు తొలగి భక్తా బిష్ఠసిద్ధి కలుగునని పురాణోక్తి వివరిస్తుందని వేదపండితులు వివరించారు. అనువంశిక ధర్మకర్త  నరసింహమూర్తి, ఈవో భాస్కరరావు, ప్రధానార్చకులు, అర్చకులు, వేదపండితులు, పర్యవేక్షకులు, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.