10-02-2025 11:08:47 PM
ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఏపీలోని మైలవరం మండల కేంద్రానికి చెందిన వేముల లక్ష్మయ్య (45) ట్రాక్టర్ నడుపుకుంటూ ఎర్రుపాలెం మీదుగా మధిర వెళుతున్న క్రమంలో మీనవోలు వద్ద తాను నడుపుతున్న ట్రాక్టర్ రోడ్డు పక్కన ఉన్న మట్టి కుప్పను ఎక్కడంతో సీటులో ఉన్న డ్రైవర్ ఎగిరి కిందపడడంతో ట్రాక్టర్ ట్రాలి అతని మీద నుంచి వెళ్ళిపోయింది. దీంతో డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడని పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎర్రుపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.