calender_icon.png 24 August, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి మత్తు జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలు

24-08-2025 12:00:51 AM

నాలుగు బైకులు, ఒక ఆటో చోరీ  కేసులో ఇద్దరి యువకుల అరెస్ట్

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): గంజాయి, మద్యం మత్తుకు బానిసలుగా మరి జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు యువకులు వరుసగా వాహనాల చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. శనివారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తూ పెద్దకొత్తపల్లి మండలం వావిళ్ళబాయి గ్రామానికి చెందిన యుగంధర్ నాయుడు (24), నాగర్ కర్నూల్ పట్టణంలోని వినోబా నగర్ ప్రాంతంలో నివసిస్తున్న వేపూరి నీలంబర్(22) ఇరువురు నాగర్ కర్నూల్ పట్టణంలో నివాసం ఉంటున్నారు.

పటంలోని గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు పడిన గ్యాంగ్లో పనిచేస్తూ గంజాయితోపాటు మద్యానికి బానిసలుగా మారి డబ్బుల కోసం తరచూ ద్విచక్ర వాహనాలు ఆటోలు చోరీలకు పాల్పడుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం నాగర్ కర్నూల్ పట్టణంలోని ఎర్రగడ్డ కాలనీకి చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం చోరి గురైందని పోలీసులకు తెలియచేశారు దీనిపై విచారించిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి.

ఉప్పల్, మేడిపల్లి, కల్వకుర్తి, వనస్థలిపురం వంటి ప్రాంతాల్లో 1.94 వేలు విలువ చేస్తే నాలుగు ద్విచక్ర వాహనాలు ఒక ఆటో దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. నాగర్ కర్నూల్ పట్టణ ప్రాంతంలో వాహనాల తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వీర్నే పట్టుకున్నట్లు సిఐ తెలిపారు. వీరు నుండి నాలుగు ద్విచక్ర వాహనాలు ఒక ఆటో స్వాధీనం చేసుకొని వారిని కోర్టు ముందు హాజరు పరిచినట్లు తెలిపారు. వీరిని చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ టీం బృందాన్ని వారు ప్రశంసించారు. వారితో పాటు ఎస్ఐ గోవర్ధన్ ఉన్నారు.