calender_icon.png 5 November, 2025 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమ్ము శేఖర్ మాదిగకు ఓయీ డాక్టరేట్

05-11-2025 01:41:20 AM

ముషీరాబాద్, నవంబర్ 4 (విజయక్రాం తి): పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫె సర్ వై.పార్థసారథి పర్యవేక్షణలో ‘కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ మునిసిపల్ కార్పొరేటర్స్ అండ్ కౌన్సిలర్స్ టువరడ్స్ అర్బన్ గుడ్ గవర్నెన్స్, ఎ స్టడీ ఆఫ్ తెలంగాణ స్టేట్’ అనే అంశంపై చేసిన విశ్లేషణాత్మక పరిశోధనకుగాను కొమ్ము శేఖర్ మాదిగకు ఉస్మానియా  యూ నివర్సిటీ డాక్టరేట్ అవార్డును మంజూరు చేసింది.

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షు డు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మార్గ నిర్దేశ కత్వంలో నడుస్తున్న మాదిగ స్టూడెంట్ ఫెడ రేషన్ (ఎంఎస్‌ఎఫ్)లో కీలక నాయకుడిగా ఎదిగిన శేఖర్ ఓయూ అధ్యక్షుడిగా, పలు జిల్లాలకు ఇన్‌చార్జిగా తన సేవలను అంది స్తూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతి నిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

సూర్యా పేట జిల్లా యర్కారం గ్రామానికి చెందిన సరోజ-, అంజయ్య దంపతులకు జన్మించిన శేఖర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివి, నిజాం కాలేజీలో చదువే కాలంలో విద్యార్థి నాయ కుడిగా, ఓయూ ఆరట్స్ కాలేజీలో పీజీ పూర్తి చేసిన శేఖర్ డాక్టరేట్ బిరుదు అందుకున్న అనంతరం తనకు స్ఫూర్తిగా నిలిచిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగను వారి నివాసంలో కలిసినట్లు తెలిపారు. సహకరించిన తన గురువు ప్రొఫెసర్ వై.పార్థసారథికి ధన్యవా దాలు తెలిపారు.