calender_icon.png 17 August, 2025 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీకాంతా చారి ప్రాణత్యాగం వృథాపోదు

16-08-2025 12:00:00 AM

మాజీమంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, ఆగస్టు 15 (విజయ క్రాంతి): ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం కోసం ప్రాణాలను అర్పించిన శ్రీకాం తాచారి ప్రాణత్యాగం ఎన్నటికీ వృ ధా పోదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. తెలంగాణ అమర వీరుడు శ్రీకాంతా చారి జయంతి సందర్భం గా శుక్రవారం ఆదిలాబాద్‌లోని ఆయన విగ్రహానికి బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, స్వర్ణకారుల సంఘం సభ్యు లతో కలిసి మాజీమంత్రి పూల మా లలు వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. శ్రీకాంతాచారి ప్రాణ త్యాగం తోనే తెలంగాణ ఉద్యమం మరింత ఉవ్వెత్తున లేసిందని అన్నారు. అ లాంటి అమరులను  కాంగ్రెస్ ప్రభు త్వం గుర్తించకపోవడం అధికార మ దంలో  తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తుందని ధ్వజమెత్తారు. 

ఐక్యంగా ఉంటూ దేశాన్ని అభ్యున్నతి పథంలో నడిపించాలి

మహనీయుల పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని, వా రి స్పూర్తితో ప్రతి ఒక్కరు బాధ్యతా యుతంగా వ్యవహరిస్తూ దేశాన్ని అ భ్యున్నతి పథంలో నడపాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ బీఆర్ ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసి న కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ముందుగా మహనీయుల చిత్రపటాల వద్ద పూ జలు చేసి, అనంతరం త్రివర్ణ పతాకా న్ని ఆవిష్కరించి జాతీయ గీతాలా పన చేశారు. ప్రజలకు స్వాతంత్ర ది నోత్సవ శుభాకాంక్షలు తెలియచేశా రు. కుల, మత భేదాలు లేకుండా ఐక్యంగా ఉంటూ దేశాన్ని అభ్యున్నతి పథంలో నడిపేందుకు కృషి చేయా లనీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్ర మంలో పట్టణ అధ్యక్షుడు అజయ్, విజ్జగిరి నారాయణ, యా సం నర్సిం గరావు, సెవ్వ జగదీష్, మెట్టు ప్రహ్లా ద్, మార్శెట్టి గోవర్ధన్, యూనిస్  అక్బనీ, సాజితోద్దీన్ సలీం పాషా, పండ్ల శీను, ప్రేమల, స్వరూప రాణి, మమత, కరుణ, పర్వీన్ ఫెరోజ్, తదితరులు పాల్గొన్నారు.