16-08-2025 12:00:00 AM
ఇబ్రహీంపట్నం కోర్టు జడ్జి శ్రీదేవి
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 15 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం కోర్టు వద్ద ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శంకర శ్రీదేవి ఆధ్వర్యంలో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జెండాను ఎగురవేసి మాట్లాడారు. ఎంతోమంది ప్రాణత్యాగం చేసి మనకు స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టారని చెప్పారు. బార్ అసోసియేషన్ ఇబ్రహీంపట్నం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలలో విజే తలకు బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి రీటా లాల్ చంద్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి యశ్వంత్, అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ హిమబిందు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముద్దం వెంకటేశం, ప్రధాన కార్యదర్శి అరిగే శ్రీనివాస్‌కుమార్, ఉపాధ్యక్షులు భా స్కర్, సంస్కృత కార్యదర్శి జైపాల్ నాయక్, లైబ్రేరియన్ పాండు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రామకృష్ణ, మల్లేష్ సీనియర్ న్యాయవాదులు సుగుణాకర్‌రెడ్డి, నర్సిరెడ్డి, అరుణ్ కుమార్, అంజన్‌రెడ్డి, డి. రవీందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, జేపీ మహేందర్ పాల్గొన్నారు