calender_icon.png 17 August, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

16-08-2025 12:00:00 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 15 (విజయక్రాంతి): నాంపల్లిలోని డీసీసీబీ బ్యాంక్ ప్రధాన కార్యాలయం, తుర్కయాంజల్‌లోని తుర్కయాంజల్ రైతు సేవా సహకార సం ఘంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య జాతీయ జెండాను ఎగురవేశారు.

కార్యక్రమం అనంతరం తెలంగాణ ప్రభుత్వం పాక్స్, డీసీసీబీ పిఐసి చైర్మన్ల పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ భాస్కర సుబ్రహ్మణ్యం, జీఎంలు ప్రభాకర్‌రెడ్డి, ఫణి శ్రీరామ్, డీజీఎంలు, ఏజీఎంలు, అలాగే తుర్కయాంజ ల్‌లో సొసైటీ వైస్ చైర్మన్ కొత్తరాంరెడ్డి, డైరెక్టర్లు సంజీవ్‌రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, చేపల యాదగిరి, చెక్క లక్షమామ్మ, సెక్రటరీ వై రాందాస్ పాల్గొన్నారు.