calender_icon.png 5 August, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుద్ధనగర్‌లో అంగరంగ వైభవంగా శ్రీనివాస వైభవోత్సవం

04-08-2025 12:22:23 AM

మేడిపల్లి జూలై 3: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బుద్ధ నగర్ లో శ్రీనివాస వైభవ్త్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు స్థానిక కమ్మల్లపల్లి శ్యాంప్రసాద్, శివకుమార్ కుటుంబo ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే 11 రకాల ప్రత్యేక సేవలను నిర్వహించారు.

అనేకమంది భక్తులు తిరుపతి కొండపైకి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నప్పటికీ అన్ని రకాల సేవలను చూసే భాగ్యం కలగదని ఈ నేపథ్యంలోనే భక్తులకు స్వామివారి సేవలు అన్నింటిని చూపించాలని మంచి సంకల్పంతో ఈ వైభవోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ వేద పండితులు ఆచార్య ఆత్రేయ స్వామి నేతృత్వంలోని అర్చక బృందం స్వామివారి సేవలను సంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు.

ఆదివారం తెల్లవారుజామున సుప్రభాత సేవ తో ప్రారంభించి రాత్రి పవళింపు సేవ, ఏకాంత సేవతో ఉత్సవాలను ముగించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించి అన్నప్రసాద వితరణ సైతం ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న పిర్జాది గూడ మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ కార్పొరేటర్ నవీన్ రెడ్డి, ఇతర ప్రముఖులు, నగరవాసులు, భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలునిర్వహించారు.