04-08-2025 12:22:49 AM
ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, ఆగస్టు 3 : విశ్వశాంతి కోసం వీరశైవ లింగాయత్ లు బొంతపల్లి వీరభద్ర స్వామి దేవస్థానం వరకు ప్రతి సంవత్సరం పాదయత్రా చేస్తుండడం అభినందనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు వీరశైవ సమాజం ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలోని ఉమామహేశ్వర దేవాలయం నుంచి బొంతపల్లి వీరభద్ర స్వామి దేవాలయం వరకు చేపట్టిన 18వ మహా పాదయాత్రను ఆదివారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
బీఆర్‌ఎస్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్ చెరు, రామచంద్రాపురం కార్పొరేటర్ లు కుమార్ యాదవ్, పుష్పనగేశ్ లు పాదయాత్రలో పాల్గొని వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ 12వ శతాబ్దంలో అభ్యుదయ సమాజం కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా బసవేశ్వరుడి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు.
18 సంవత్సరాలుగా ఏకధాటిగా పాదయాత్ర చేపడుతుండడం హర్షనీయమన్నారు. నియోజకవర్గం లోని వీరశైవుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, నర్రా భిక్షపతి, పృథ్వీరాజ్, వీరశైవ లింగాయత్ సమాజం ప్రతినిధులు, వివిద పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.