calender_icon.png 13 November, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాబీర్ పాషా ఆధ్వర్యంలో తిరిగి సొంత గూటికి శ్రీరామ్ హరీష్

13-11-2025 07:59:00 PM

ఎర్రజెండా నాకు అండ

సిపిఐ పార్టీ లోనే కొనసాగుతా.. హరీష్

ఆళ్ళపల్లి (విజయక్రాంతి): చివరి వరకు సిపిఐ పార్టీలోనే కొనసాగుతానని మండల కేంద్రానికి చెందిన శ్రీ రామ్ హరీష్ సృష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా నాయకత్వంలోనే కొనసాగాలని నిర్ణయించుకుని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రేసు ఎల్లయ్య మండల కార్యదర్శి కొమరం హనుమంతరావు ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా సమక్షంలో సిపిఐ పార్టీలో మరల తిరిగి చేరడం జరిగిందన్నారు. ఎర్రజెండా ఎప్పటికీ అండగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రేసు సురేందర్, గుంతోజు శివ తదితరులు పాల్గొన్నారు.