13-11-2025 07:56:13 PM
మునిపల్లి: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సహకారంతో మండలంలోని పెద్ద గోపులారం గ్రామానికి చెందిన మ్యాతరి మల్లమ్మ భర్త మాణిక్యరావుకు మంజూరైన రూ. 60వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కును గురువారం నాడు పెద్ద గోపులారం మాజీ ఎంపీటీసీ పాండు అందజేశారు. ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరము లాంటిదని, అందుకు అర్హులైన వారందరూ సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే మంత్రి దామోదర రాజనర్సింహ సహకారంతో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి చెక్కులు అందుతాయని అన్నారు. రాయికోడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అమరేశ్వర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు నరేందర్ చారి, తదితరులు పాల్గొన్నారు.