calender_icon.png 26 November, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర ప్రభుత్వం దివాలాకోరు బడ్జెట్..

19-03-2025 07:30:00 PM

మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): 2025-2026 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దివాలా కోరు బడ్జెటని మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్ర బడ్జెట్ పై స్పందించిన ఆయన ఈ బడ్జెట్ పేద ప్రజల వ్యతిరేక బడ్జెట్, అంతా ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన బడ్జెట్గా ఆయన అభివర్ణించారు. 6 గ్యారంటీలతో పాటు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు.