23-04-2025 09:13:42 AM
హర్షం వ్యక్తం చేస్తున్న కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు
ఎమ్మెల్యే కూనంనేని అభినందనల వెల్లువ
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు, సుజాతనగర్ మండల పరిధిలోని కోమటిపల్లి, నిమ్మలగూడెం, మంగపేట, నాయకులగూడెం, సుజాతనగర్, నర్సింహసాగర్, లక్ష్మీదేవిపల్లి గ్రామపంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన కృషి తుది అంకానికి చేరింది. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ఆమోదించిన విషయం విధితమే. ఈ తీర్మానంపై రాష్ట్ర గవర్నర్ మంగళవారం గెజిట్ జారీచేశారు. గెజిట్ జారీతో దాదాపు కొర్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందని తెలుపవచ్చు. త్వరలో ప్రభుత్వం నుంచి జివో జారీ కానుంది.
కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుపై గెజిట్ జారీ కావడంతో కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది. కార్పొరేషన్ ఏర్పాటుపై పట్టుబట్టి సాధించిన శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావుకు ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్కకు, జిల్లా ఇంచార్జి మంత్రి కోమటి రెడ్డికి, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ , ఇతర అధికారులకు కూనంనేని ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటుకు యెనలేని కృషి చేసిన కూనంనేని సాంబశివరావు కు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అభినందనలు తెలిపారు.ENDఆ