calender_icon.png 19 May, 2025 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే కుటుంబంలో 10 మంది చనిపోవడం బాధాకరం

19-05-2025 01:36:52 AM

  1. ఐటీ శాఖ- మంత్రి శ్రీధర్‌బాబు 

మృతుల కుటుంబాలకు పరామర్శ

రాజేంద్రనగర్, మే 18: ఒకే కుటుంబానికి చెందిన పదిమంది చనిపోవడం అత్యంత బాధాకరమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పరపల్లి గౌతమ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని పదిమంది మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను అధికారులు ఆదివారం సాయంత్రం గౌతమ్‌నగర్ తీసుకెళ్లారు.

మంత్రి శ్రీధర్‌బాబు, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి గౌతమ్‌నగర్ వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

మరోవైపు ఆదివారం సాయంత్రం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను గౌతంనగర్‌కు తీసుకురావడంతో కొద్దిసేపు ఇంటి వద్ద ఉంచి అనంతరం పురానపూల్‌లోని శ్మశానవాటికకు తరలించారు. అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. మృతుల ఇంటి వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.