19-05-2025 12:58:50 AM
- మరో కర్మాగారం ప్రశ్నార్ధకమే?
- పరిశ్రమ జిల్లాలో మూతబడుతున్న కర్మగారాలు
- ఈ పాపం ఎవరిది?
భద్రాద్రి కొత్తగూడెం మే 18 (విజయ క్రాంతి) మసక పాడుతున్న వెలుగుల పట్నం పుష్కలంగా వనరులున్న కొత్త ధర్మల్ కేం ద్రం ప్రశ్నార్ధకంగానే మిగిలింది. ఒకనాడు పరిశ్రమల జిల్లాగా పేరొందిన కొత్తగూడెం నియోజకవర్గం నేడు మూతపడుతున్న పరిశ్రమలకు నిలయంగా మారుతోంది.
ఈ పాపం ఎవరిది?. ఇప్పటికే గ్యాస్ కర్మాగారం మోతబడింది, అప్పటి స్పాంజ్ ఇండియా లిమిటెడ్, ప్రస్తుత ఎన్ ఎం డి సి దాదాపు మూతబడినట్లే. నవభారత్ కర్మాగారం ఉన్న ఉద్యోగ అవకాశాలుస్తున్న. ఈ తరుణంలో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నుంచి విడిపోయిన భద్రాద్రి కొత్తగూడెంకు పరిశ్రమ జిల్లాగా పే రు ఉంది.
రాష్ట్రానికి వెలుగుల ప్రసాదించే కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ (కే టి పి ఎస్) ఉమ్మడి రాష్ట్రానికే తలమానికంగా విరాజిలింది. ఉత్పత్తిలో వరుసగా బంగారు కాంస్య పథకాలు సాధించిన కేటీపీఎస్ కరమాగారం నేడు విద్యుత్ వెలుగులు లేక వేలవేల పోతోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమలు జిల్లా కాస్త బొందల గడ్డ ప్రాంతంగా మారుతుందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుష్కలమైన వనరులున్న పాల్వంచను కాదని గత పాలకులు ముందస్తు ప్రణాళిక లేకుండా ఎలాంటి వనరులు లేని దామర చర్లలో రో 40, వేల కోట్లతో 800 మెగావాట్ల సామర్థ్యం గల 5 యూనిట్లను చేపట్టడం, ఎందుకు పనికిరాని భద్రాద్రి ధర్మల్ కేంద్రం మణుగూరులో ప్రారంభించడం తోపాటు, కాలం చెల్లిన కారణంగా 720 మెగా వాట్ల సామర్థ్యం గల కేటీ పీఎస్ ఓఎల్యం కర్మాగారానికి చెందిన 8 యూనిట్ల కూల్చివేతతో పరిశ్రమల జిల్లా మస్కబారిందని చెప్పక తప్పదు.
దామరచర్లలో చేపట్టిన ధర్మల్ ప్రాజెక్టులో సగం యూనిట్లను పాల్వంచలో నిర్మిస్తే నేడీ పరిస్థితి ఉండేది కాదని పలువురు అంటున్న మాట. 1967లో పాల్వంచలో చేపట్టిన కేటీపీఎస్ కర్మాగారం అంచలంచలుగా ఎదిగి 11 యూనిట్లతో 2,520 మెగావాట్ల ధర్మాలు కు చేరి రాష్ట్రంలోనే అతిపెద్ద ధర్మల్ విద్యుత్ ఉ త్పత్తి కేంద్రంగా అభివృద్ధి చెందింది.
దీంతో పాల్వంచ పట్టణంలో నిత్యా కళ్యాణం పచ్చ తోరణం గా జంట పట్టణాలైనా పాల్వంచ, కొత్తగూడెం కొనసాగాయి. ఈ తరుణంలో కేటీపీఎస్ 7వదశ మంజూరు సమయంలో కాలం చెల్లిన పాత కర్మగారం కేటీపీఎస్ ఓ ఎం ను కూల్చి వేస్తేనే 800 మెగావాట్ల సా మర్థ్యం కలిగిన 7 వదర్శకర్మాగారానికి అనుమతులు ఇస్తామని కేంద్ర పర్యావరణ కాలు ష్య నియంత్రణ మండలి తిరకాసు పెట్టారు.
అప్పటి జెన్కో యాజమాన్యం అందుకు అం గీకరించి 800 మెగావాట్ల కర్మాగారానికి అనుమతులు పొందారు. వారికి వచ్చిన మాట ప్రకారం 2018లో కర్మాగారాని మూ సివేసి, 2022లో కేటిపేస్ వైనం కర్మాగారాన్ని కూల్చివేయడం జరిగింది. ఆ సమ యంలో కర్మాగారంలో పనిచేస్తున్న సుమా రు 2000 మంది కార్మికులు, అధికారులను ఇతర కర్మాగారాలకు బదిలీ చేయడంతో ప ట్టణానికి కలతప్పింది.
ఫలితంగా ఉద్యోగ ఉపాధి వాణిజ్య రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడింది. ఆనాడే జనకో యాజమాన్యం కానీ, ప్రజా ప్రతినిధులు కా నీ కాలం చెల్లిన కర్మాగారం కూల్చివేస్తాము, అధునాతన సాంకేతితో కూడిన మరో రెం డు కర్మాగారాలను ఏ ప్రాంతానికి మంజూ రు చేయాలని పట్టు పట్టి ఉండాల్సింది.
పు ష్కలమైన వనరులు ధర్మలు విద్యుత్తుకు అవసరమైన స్థలం, నీరు ,బొగ్గు, రైల్వే లైను ఉన్నాయని కర్మాగారం కోసం పట్టు పట్టకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించా రు. దీంతో ఉన్నది పోయింది, కొత్తది రా కుండా పోవడానికి కారకులెవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు అయింది.
స్వరాష్ట్రం వచ్చిన తర్వాత తిమింగలాలు పెరిగాయి?
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా వాళ్ళ పెత్తనం ఉందని తెలంగాణ ఉద్యమానికి నాంది కేటీపీఎస్ కర్మాగారం గా నిలిచింది. స్వరాష్ట్రం సి ద్ధించిన తర్వాత తెలంగాణ కర్మాగారాలను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని నీళ్లు ని ధులు నియామకాలు సాధిస్తామని ఒక దం పుడు ఉపన్యాసాలు ఇచ్చారు.
రాష్ట్రం వచ్చిన తర్వాత తిమింగలాలు పెరిగి గుడిని గుడి లింగాన్ని మింగడంతో జెన్కో అప్పుల ఊబిలోకి నెట్టబడిందనే ఆరోపణలు లేకపోలేదు. నాడు ప్రతి పని పారదర్శకంగా నిబంధనల ప్రకారం జరిగితే, స్వరాష్ట్రంలో నిబంధనలు పాతర వేసి నామినేషన్లు పై అంచనాలకు మించి నిధులు వెచ్చించి దండుకున్నారనే ఆరోపణలు దండిగా ఉన్నాయి.
చెట్టుపై కూ ర్చుని కొమ్మ నరుకోవడం అంటే ఇదే మర ని పరిశీలకు అంటున్న మాట. అంతా అయిపోయిన తర్వాత కొత్త పరిశ్రమలు కావాలి అంటూ పాట పాడటం విడ్డూరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ధర్మల్ విద్యుత్ కేంద్రాల కంటే సోలార్ విద్యుత్ కేంద్రాలపైనే ఎక్కువ మక్కువ చూపుతోంది.
ఒకవైపు ఆర్థిక సంక్షో భం మరోవైపు అప్పుల ఊబిలో కోరుకుపోయిన జెన్కో నేపథ్యంలో పాల్వంచకు కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రశ్నార్ధకమే అని చె ప్పక తప్పదు. ఇప్పటికే పాల్వంచలోని గ్యాస్ కంపెనీ మూతబడింది, గతంలో అభివృద్ధి బాటలో పయనించిన ఆనాటి స్పాంజ్ ఐర న్ కర్మాగారం నేటి ఎన్ ఎం డి సి దాదాపు మూసి వేశారు.
ప్రైవేటు సంస్థ నవభారత్ క ర్మాగారం ఉన్న ఉద్యోగ అవకాశాలుస్తున్నా. ఉన్న ఏకైక కేటీపీఎస్ కూడా మూతపడే పరిస్థితికి వస్తే పరిశ్రమల జిల్లా కాస్త బొందల గడ్డ ప్రాంతంగా మారక తప్పదు.
ఇప్పటికైనా జెండాలు, ఎజెండాలో పక్కనపెట్టి పరిశ్రమల జిల్లాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఎన్‌ఎండిసి కర్మాగారాన్ని వివిదీకరణ దిశగా ప్రయత్నించడం, కేటీపీఎస్ కు మరో కర్మాగారాన్ని సాధించడానికి ప్రజాప్రతినిధులు, ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.