calender_icon.png 19 May, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైర్ సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వాలి

19-05-2025 01:40:44 AM

  1. చిన్న ప్రమాదమే అయినా ప్రాణనష్టం ఎక్కువ సంభవించడం దారుణం
  2. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): అగ్నిప్రమాదాల నివారణకు రాష్ట్రప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని, అగ్నిప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సమగ్ర శిక్షణ అందించాల్సి ఉందని, రాష్ట్రప్రభుత్వం తక్షణ స్పందించి ఆ దిశగా చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న ఆయన హుటాహుటిన పాతబస్తీలోని ఘటనా స్థలికి వెళ్లారు.

అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూటీంలను అమప్రత్తం చేశా రు. అగ్నిమాపకసిబ్బం ది తక్షణం స్పందించకపోవడంతోనే ప్రాణనష్టం పెరిగిందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయని తెలిపారు. అగ్నిప్రమాదం చిన్నదే అయినప్పటికీ, ప్రాణనష్టం ఎక్కువ సంభవించడం దారుణమైన విషయమన్నారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. క్షతగాత్రు లకు మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. 

‘అగ్నిప్రమాదం సంభవించిందని తెలియగానే అగ్నిమాపశాఖ సరైన విధంగా స్పందించలేదు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. నిజానికి అగ్నిమాపక సిబ్బంది వద్ద సరైన అగ్నిమాపక పరికరాలు సైతం లేవు. అగ్నిప్రమాదాల నివారణకు రాష్ట్రప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అగ్నిమాపకశాఖకు సర్కార్ అధునాతన పరికరాలు సమకూర్చాలి.’ అని కేంద్ర మంత్రి సూచించారు.