18-05-2025 11:56:44 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ పట్టణం దస్నాపూర్ లోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఆరో వార్షికోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆదివారం ఆలయం ఆవరణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేశారు. గురువారం ఉదయం ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ పేర్కొంది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీరాములు, తిరుపతి, అశోక్, భాస్కర్, వేణుగోపాల్, వెంకటయ్య ,తదితరులు పాల్గొన్నారు.