calender_icon.png 19 May, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో అందగత్తెల సందడి

19-05-2025 12:54:59 AM

  1. సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ సందర్శన

తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కారాలు 

డ్రగ్స్ నివారణకు పోస్టర్లపై సంతకాలతో మద్దతు

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న మిస్ వరల్డ్ పోటీదారులు ఆదివారం హైదరాబాద్‌లో సం దడి చేశారు. 107 దేశాల పోటీదారులు బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కమాం డ్ కంట్రోల్ సెంటర్, సెక్రటేరియట్‌ను సందర్శించా రు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి, రాష్ర్టం లో శాంతిభద్ర తల రక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను తెలుసుకున్నారు.

డ్రగ్స్ నివారణకై తెలంగాణ పోలీస్ చేపట్టిన చర్యలకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పోస్టర్లపై సంతకాలు చేసి పలు సందేశాలు రాశారు. ఆడిటోరియంలో పోలీస్ శాఖ అమ లు చేస్తున్న పలు విధానాలపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటే షన్ ద్వారా వివరించారు. దేశంలో మరెక్కడా లేని విధం గా ట్రాన్స్‌జెండర్ల సేవలను ట్రాఫిక్ విభాగంలో ఉపయోగించుకుంటున్నామని తెలిపారు.

మొత్తం ప్రపంచానికే సవాలు గా మారిన సైబ ర్ నేరాల నియంత్రణ లో అత్యంత ఆధునిక టెక్నాలజీని వాడుతున్నామని, లక్షల సంఖ్యలో ఏర్పాటు చేసిన సీసీ టీవీల వల్ల, రాష్ర్టంలో ఎక్కడ నేరం జరిగినా వెంటనే తగు చర్యలు చేపడుతున్నామని వివరించారు. ముఖ్యంగా సెఫ్టీ టూరిజంలో తెలం గాణ అత్యంత సురక్షితమైనదని, ఇందుకు తెలంగాణా పోలీస్ చేపట్టిన పటిష్ఠమైన చర్యలే కారణమని అధికారులు వివరించారు.

అనంతరం తెలంగాణ పండగలు, సంస్కృతి, సంప్రదాయాలు ఆవిష్కరించే లా శాస్త్రియ నృత్య ప్రదర్శన జరిగింది. ఈ పర్యటనలో భాగంగా పోలీసు ఆయుధాల ప్రదర్శన, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, పోలీస్ జాగిలాల ప్రదర్శనలు, పైప్ బ్యాండ్, అశ్విక దళ ప్రదర్శనలను సుందరీమణులు ఆసక్తిగా తిలకించారు. ట్రాఫిక్ నియంత్రణా చర్యలకు సేవలందిస్తున్న ట్రాన్స్‌జెండర్లతో కలసి ఫొటోలు దిగారు. 

సచివాలయంలో సుందరీమణులు

తెలంగాణ సచివాలయంలో సుందరీమణులు సందడి చేశారు. అక్కడ ప్రతిష్టించిన తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించారు.  సచివాలయంలో ఏర్పాటు చేసిన డ్రోన్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ తల్లి రూపాన్ని డ్రోన్ల ద్వారా ఆవిష్కరించారు. మహాలక్ష్మీ, రూ.500లకు గ్యాస్ సిలిండర్, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలను డ్రోన్ల ద్వారా ప్రదర్శించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే అనేక ఆకృతులను డ్రోన్ల ద్వారా ప్రదర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ సచివాల యం మువ్వెన్నెల జెండా రంగుల్లో కాంతులీనింది. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.