calender_icon.png 20 October, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌రెడ్డికి బూతులపై ఉన్న సోయి రైతులపై లేదు

20-10-2025 12:00:44 AM

  1. పత్తి, మొక్క జొన్న, వరి    కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి 

పంట పొలాలలో రైతు కూలీలతో మాట్లాడిన మాజీ మంత్రి  సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు 

సిద్దిపేట, అక్టోబర్ 19 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డికి ప్రతి పక్షాలను తిట్టే బూతుల మీద ఉన్న సోయి పత్తి, మొక్క జొన్న, వరి పంటలు సాగు చేసిన రైతుల తిప్పలపై లేదని, ప్రభుత్వం యుద్ధప్రాదిపదికన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలనీ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని గంగాపూర్ గ్రామంలో మొక్క జొన్న కంకుల పొట్టు తీస్తున్న కూలీలు పగటి పూట భోజనం చేస్తుండగా హరీష్ రావు వాళ్ళ దగ్గరకు వెళ్లి కూర్చొని ముచ్చటించారు.

రైతులు సాగు చేసిన పంటల వివరాలు, విక్రయాలకు వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అధిక వర్షాలు పడి ఇప్పటికే పత్తి రైతులకు దిగుబడి తగ్గి నష్టం జరిగిందని, ఉన్న పత్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనడం లేదన్నారు. దాంతో పత్తి రైతులు దళారులకు విక్రయిస్తూ రూ.8100 మద్దతు ధరను కోల్పోయారని చెప్పారు.

ఈ ప్రభుత్వం పత్తి రైతులకు క్వింటాలుకి రూ.2వేల నష్టం కలిగిస్తుందన్నారు. రాష్ట్రంలో 6లక్షల ఎకరాలలో మొక్క జొన్న సాగు చేశారని, మక్కలు మార్కెట్ లో పెట్టుకునో రైతులు పడిగాపులు కస్తున్నారనీ చెప్పారు. ఇప్పటికే 30%- 40% వరకు రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించారని వెల్లడించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో సకాలంలో మక్కలు కొన్నామని, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చామని, సకాలంలో రైతు బంధు ఖాతాలో జమ చేశామని తెలిపారు.

రెండుసార్లు రైతు బందులు ఇచ్చి, రెండు రైతు బందులు ఏగొట్టిండు, సగం ఋణ మాఫీ చేసి, సగం రుణ మాఫీ ఎగొట్టిండు, కౌలు రైతులకు ఋణమాఫీ చేస్తా అని మాట తప్పిండు, రైతులకు 11 గంటల కరెంట్ మాత్రమే ఇస్తుండనీ మండిపడ్డారు. తొందరపడి రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవద్దనీ సూచించారు. 

అధైర్యపడకండి అండగా ఉంటా..

సిద్దిపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను ఆదివారం హరీష్ రావు సందర్శించి పరామర్శించారు అధైర్య పడద్దని అండగా ఉంటానని భరోసా కల్పించారు. హుస్నాబాద్ మండలంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో మృతి చెందిన వివేక్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని భరోసా కల్పించారు.