13-08-2025 10:08:13 PM
రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి
మహిళలకు 2500 రూపాయలు ఇవ్వాలి
పెంచుతామన్న పింఛన్లు అమలు చేసి వృద్ధులకు ఇవ్వాలి
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్
నకిరేకల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం చోద్యం చూస్తూ ప్రజలకు ఏర్పాట్లు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) విమర్శించారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో ప్రైవేట్ ప్రోగ్రాం కు హాజరై ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కేసిఆర్ ప్రభుత్వంలో గ్రామాల్లో మండలాల్లో యూరియా కోసం రైతులు ఎదురుచూస్తూ లైన్లు కట్టిన దాఖాలాలు లేవు అన్నారు. ఎంపీలుగా మేము కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆరు నెలలు 8 నెలల ముందే యూరియాను నిల్వ ఉంచి రైతులకు ప్రజలకు అందించే వాళ్ళం అన్నారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సరైన సమయంలో రైతులకు యూరియా అందించడంలో కేంద్రం నుండి తేవడంలో పూర్తిగా విఫలం చెందిందని ఆమె విమర్శించారు.
రైతులకు యూరియా లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కేంద్రంతో మాట్లాడి యూరియా తెప్పించడం కూడా పూర్తిగా విఫలం చెందారని ఆమె విమర్శించారు. కనీసం ఎంత అవసరం ఉందో చెప్పలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆమె విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మంత్రులు స్పందించి రైతులకు యూరియాను అందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ వర్షాల ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రజలను ఆదుకోవాలని ఆమె కోరారు. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను. మహిళలకు ఇస్తన్న 2500 ఇవ్వాలని పెంచుతామన్న పింఛన్లు అమలు చేసి వృద్ధులకు వికలాంగులకు మహిళలకు అందించాలని డిమాండ్ చేశారు లేనియెడల పోరాటాలు రూపొందిస్తామని ఆమె హెచ్చరించారు.