calender_icon.png 15 August, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

14-08-2025 01:10:36 AM

చేవెళ్ల, ఆగస్టు 13: చేవెళ్ల, ఆగస్టు 13: విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలని చేవెళ్ల ఎక్సైజ్ ఎస్త్స్రలు ఖాజా మొయినుద్దీన్, వెంకటేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం చేవె ళ్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్ డా. ఎం. రమేష్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ వాడకంతో కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్కు అలవాటు పడి బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని సూచించారు.

వ్యక్తి పాడవడమే కాకుండా అతని కుటుంబంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. యాంటీ-డ్రగ్స్ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థలు, స్వచ్చంద సంస్థలు కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాలేజీలో వివిధ అంశాలపై అవగాహన కల్పించడమే కాకుండా, వివిధ రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ప్రిన్సిపాల్ డా. కాంచనలత పనితీరును వారు కొనియాడారు.