14-08-2025 01:11:46 AM
వికారాబాద్, ఆగస్టు- 13( విజయక్రాంతి) ఈనెల 15న వికారాబాద్ జిల్లా తాండూరులో ఆర్యవైశ్య రాజకీయ, చైతన్య సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాలే లక్ష్మణ్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15న మధ్యాహ్నం ఒకటి గం టలకు ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియం తాండూరులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మేళనానికి జిల్లాలోని ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు.