19-11-2025 05:28:37 PM
దొరికిన మొబైల్ అందజేత
నిర్మల్ (విజయక్రాంతి): దొరికిన మొబైల్ ఫోన్ను బాదితునికి అందజేసి తన నిజాయితిని చాటుకున్నాడు ఓ విద్యార్థి. నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ జర్నలిస్ట్ కాలనీకి చెందిన రాంపెల్లి సాయి స్వరూప్ శ్రీనగర్ కాలనీ వైపు వెలుతున్న క్రమంలో రోడ్డుపై మొబైల్ ఫోన్ దొరికింది. దొరికిన మొబైల్ ఫోన్ను తన వద్ద ఉంచుకోవద్దని ఈ ఫోన్ ద్వారా నగదు లావాదేవీలు, విలువైన సమాచారంతో పాటు భద్రతకు సంబందించిన సమాచారం ఉంటుందని మొబైల్ పోగొట్టకున్న వ్యక్తికి దీన్ని అందించాలని అతడు నిర్ణయించుకున్నాడు. మొబైల్ తెరిచి చూసేసరికి స్కీన్ లాక్ ఉండడంతో ఆ వ్యక్తే ఫోన్ చేసేదాక వెయిట్ చేశాడు. అంతలోనే మొబైల్ పొగొట్టుకున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ తన మొబైల్కు కాల్ చేయడంతో అతని వివరాలు కనుకుని స్వయంగా అతని వద్దకే వెల్లి దొరికిన ఫోన్ను అందజేసి నిజాయితీని చాటుకున్నాడు. పోయిన ఫోన్ను తిరిగి ఇచ్చిన సాయి స్వరూప్ను కానిస్టేబుల్ తో పాటు పలువురు అభినందించారు.