calender_icon.png 19 November, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరా గాంధీ చిరస్మరణీయురాలు

19-11-2025 05:24:24 PM

టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి

గజ్వేల్: భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ చిరస్మరణీయురాలని టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి అన్నారు, ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుదవారం గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద టిపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  భారత తొలి మహిళా ప్రధాని  ఇందిరాగాంధీ  గరీభి హటావో అనే నినాదంతో నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించి, ప్రజా రంజక పరిపాలన అందించారన్నారు. ఇందిరాగాంధీ అడుగుజాడల్లో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా పాలన కొనసాగిస్తున్నారన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం 200 యూనిట్లకు లోపు ఉచిత కరెంటు, 500 రూపాయలకు సిలిండర్, రేషన్ షాప్ లో సన్న బియ్యం, ఇస్తూ రైతులకు సన్న వడ్లకు బోనస్ అందజేస్తూ ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న రేవంత్ సర్కార్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని అన్నారు, ఈ కార్యక్రమంలో అడ్వకేట్ గోపాల్ రావు గారు ఆత్మ కమిటీ డైరెక్టర్లు భవాని తిరుపతి, సయ్యద్ బాబా, మామిడి కృష్ణ, శాంతం స్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మన్నె కృపానందం, మాజీ కోఆప్షన్ నెంబర్ గంగిశెట్టి రాజు, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బాలింగారి రాజు గౌడ్ , మాజీ ఎంపిటిసి పంజాల రాజు గౌడ్, గజ్వేల్ టౌన్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ మిదే నరేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు టిల్లు రెడ్డి, వేణుగోపాల్, నాయిని శ్రీనివాస్, ప్రభాకర్ గౌడ్, కొండ రవి , మామిడి మహేష్, జమీర్, గిరిమల్లె రాజు, రమేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.