calender_icon.png 12 July, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత రంగం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

27-05-2025 12:00:00 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఏ  కూనంనేని సాంబశివరావు డిమాండ్

ముషీరాబాద్, మే 26 (విజయక్రాంతి) : వ్యవసాయ రంగం తర్వాత అత్యంత ప్రాధాన్యతగల చేనేత రంగం పరిరక్షణకు ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఏ  కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. సమాజంతోనే పుట్టిన చేనేత వృత్తి పాలకుల నిర్లక్షం కారణంగా రాను రాను నిర్వీర్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రంగానికీ ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు ఈ వృత్తి ఆధునీకరించి చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు చేనేత రంగాన్ని పరిర క్షించాలి తదితర డిమాండ్లలపై తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యాల యం మగ్ధూమ్ భవన్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

తెలంగాణ చేనేత కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఏ కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. సీపీఐ ఎంఎల్ నెల్లికంటి సత్యం, చేనేత రంగ నిపుణులు దొంతి నర్సింహారెడ్డి, సీపీఐ(ఎం)సీనియర్ నాయకులు, మాజీ ఎంఎల్ చేరుపల్లి సీతారాములు, పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళీ,

తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మి నరసయ్య, చేనేత సంఘాల నాయకులు కర్నాటి ధనంజయ, చిక్చ దేవాదాసు, రాపోలు జగన్, దాసు సురేష్, రాపోలు వీర మోహన్, ఏశాల అశోక్, కోట రాజయ్య, జల్టి రామలు, పెండెం సర్వేశం, చేవూరి ధనంజయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎస్ సబ్ తరహాలో బీసీలకు సైతం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు.

తద్వారా కుల వృత్తుల పరిరక్షణకు వృత్తుల వారికి నిధులను కేటాయించి వాటిని ఆధూనీకరించి వాటిపై ఆధారపడిన కుటుంబాలకు ఉపాధి కల్పించాలని  డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల ముం దు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన ప్రభుత్వం వాటిని దాటే వేసే ప్రయత్నం చేస్తోందని, ఇది మంచింది కాదని ఇలాంటివే భవిష్యత్త్ అధికారానికి దూరం చేస్తాయని హెచ్చరించారు. చేనేత రంగం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని కూనంనేని సాంబశివరావు చేనేత సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు.