calender_icon.png 12 July, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా తరలిస్తున్న రూ.3.07 లక్షల మద్యం పట్టివేత

26-05-2025 10:41:20 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం మహబూబాబాద్ రోడ్ లో ఉన్న చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా మహబూబాబాద్ నుంచి ఇల్లందు వైపు వస్తున్న ఎర్టిగా వెహికల్ నెంబర్ టిఎస్ 28 ఎం 7477 వావానములో అక్రమ మద్యం(Illegal liquor) లభించింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా వాహనంలో అక్రమ మద్యం బాటిల్స్ ఉన్నాయి.

వాటిని తనిఖీ చేయగా ఇంపీరియల్ బ్లూ ఆరు బాక్సులు, ఎంసీ విస్కీ 4 బాక్సులు, రాయల్ స్టాగ్ క్వాటర్ బాక్స్ ఒకటి, మెన్షన్ హౌస్ బ్రాందీ బాక్సులు ఏడు, ఆఫీసర్ ఛాయిస్ బాక్సులు 5, నాకౌట్ బీర్ బాక్సులు ఐదు, కింగ్ ఫిషర్ బీర్ బాక్సులు ఐదు, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీర్ బాక్సులు 16, 5000 బీర్ బాక్స్ లు 5, డీకే క్వార్టర్ 192 బాటిల్స్, విడిగా ఉన్న మ్యాన్షన్ హౌస్ 20 క్వాటర్ బాటిల్స్, రాయల్ స్టాగ్ క్వార్టర్ బాటిల్స్ 10, ఇంపీరియల్ బ్లూ క్వార్టర్ బాటిల్స్ 20, బాక్సులను స్వాధీన పరచుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. మణుగూరు పీకే వన్ కు చెందిన బోడ బాలాజీ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ మద్యం విలువ సుమారు రూ.3,07,200గా ఉందనీ తెలిపారు. సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సై సూర్య సిబ్బంది పాల్గొన్నారు.