calender_icon.png 13 January, 2026 | 10:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారమే లక్ష్యం

13-01-2026 12:20:10 AM

పుల్లూరు సర్పంచ్ లతవెంకట యాదవ్ 

సిద్దిపేట రూరల్, జనవరి 12: గ్రామంలోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామ సర్పంచ్ కుంచం లతా వెంకట్ యాదవ్ అన్నారు. సోమవారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. అనంతరం పాలకవర్గ సభ్యులను అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లతా వెంకట యాదవ్ మాట్లాడుతూ అంబేద్కర్ సంఘం మమ్మల్ని సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఏ సంఘం చేయని పని అంబేద్కర్ సంఘం చేసిందని హర్షం వ్యక్తం చేశారు.

గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఎస్సీ కాలనీ నుంచే ప్రారంభమయ్యాయని మురిసిపోయారు. కాలనీలో లైబ్రరీ కి అవసరమైన పుస్తకాలను అందిస్తానని, డ్రైనేజీ, నీటి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలకు రూ.5వేల ఆర్థిక ప్రోత్సాహం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ బాబు మంద, మాజీ సర్పంచ్ కే.రాజు, డి ఎస్ పి జిల్లా అధ్యక్షులు పుల్లూరి ఉమేష్, అధ్యక్షులు ఆర్. సామి, ఉపాధ్యక్షులు కే. జ్యోతిబా, ప్రధాన కార్యదర్శి ఆర్. యాదగిరి, ప్రతినిధులు బి. రవి, కే. స్వామి, ఎం.జనార్ధన్, ఆర్. రాజేష్, ఆర్. మధు, ఆర్. నవీన్, కే. సందీప్, బి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.