calender_icon.png 23 October, 2025 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్జీఎఫ్ విజేత మహబూబ్‌నగర్ జట్టు

22-10-2025 01:16:50 AM

అభినందించినఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, స్పోరట్స్ చైర్మన్ శివసేన రెడ్డి

రాజాపూర్ అక్టోబర్ 21: రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్ 17 వాలీబాల్ క్రీడా పోటీల్లో మహబూబ్ నగర్ బాలికల జట్టు సమిష్టిగా ఆడి కప్పును కైవసం చేసుకున్నారు. మండలంలోని తిరు మలాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో మహబూబ్ నగర్ బాలికలు నిజామాబాద్ జట్టుపై రెండు సెట్లను గెలిచి కప్పును కైవసం చేసుకున్నారు.రెండవ స్థానం లో నిజామాబాద్ జట్టు, మూడవ స్థానం లో ఖమ్మం బాలికల జట్లు నిలిచాయి.

విజేతలు గెలిచినా జట్లకు రాష్ట్ర స్పోరట్స్ చైర్మన్ శివసేనారెడ్డి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కప్పు మెడల్స్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర పటుత్వాన్ని పెంచుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి దినచర్యలు కొంత సమయం క్రీడలకు కేటాయించాలని తెలిపా రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక క్రీడలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. మూడు రోజులపాటు క్రీడలను దిగ్విజయంగా నిర్వహించిన తిరుమలాపూర్ గ్రామ ప్రజలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ శారదాబాయి, ఎంఈఓ సుధాకర్, బచ్చిరె డ్డి,యాదయ్య,శ్రీనివాస్,సత్యనారాయణ గౌడ్, కృష్ణయ్య, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.