calender_icon.png 25 May, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు

24-05-2025 12:28:58 AM

- రైతులు అధైర్య పడవద్దు 

- ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ ఆపలేరు 

- ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

జగిత్యాల, మే 23 (విజయక్రాంతి): అకాల వర్షాల మూలంగా తడిసిన ధాన్యా న్ని కొనుగోలు చేసేందుకు అవసర మైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో భారీ వర్షంతో తడిసి పోయిన ధాన్యాన్ని శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  పరిశీలించారు.

జగిత్యాల రూరల్ మండలం చల్గల్ వ్యవసాయ మార్కెట్, కోనాపూర్, తిప్పన్నపేట తదితర గ్రామాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీ లించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు అధైర్య పడవద్దని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు.  తడిసి న ధాన్యం కొనుగోలు విషయంగా సంబంధిత శాఖల అధి కారులతో మాట్లాడానని, వారు సంసిద్ధత వ్యక్తం చేశారని ఎమ్మెల్యే వివరించారు. ఈ విషయంపై కలెక్టర్, అదనపు కలెక్టర్లతో కూడా మాట్లాడడం జరిగిందన్నారు.

అల్ప పీడన ప్రభావంతో పాటూ నైరుతి రుతుపవనాలు కూడా ఈ సారి ముందుగా రావడం వల్ల నష్టం జరిగిందన్నారు. ప్రకృతి వైప రీత్యాలను ఎవరూ ఆపలేరని, అయినా అన్నదాత రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయటం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోల్లలో ముఖ్యంగా హమాలీల కొరత మూలంగా కొంత ఆలస్యం జరుగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సన్న వడ్లకు అదనంగా రూ. 5 వందల బోనస్ ఇస్తున్నామన్నారు.

చలిగల్లో ఇప్పటివరకు 14 వందల 44 క్వింటాళ్ల సన్న వడ్లను కొను గోలు చేయడం జరిగిందన్నారు. పేద, సన్నకారు రైతులకు రైతు భరోసా అమలు చేయటం జరిగిందని, అర్హులైన వా రందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయటం జరిగిం దన్నారు. అకాల వర్షాలున్న నేపథ్యంలో రైతులు కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని   ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట ఎమ్మార్వో శ్రీనివాస్, పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మాజీ ఏఎంసి ఛైర్మెన్లు, నాయకులు మల్లారెడ్డి, దామోదర్ రావు, నక్కల రవీందర్ రెడ్డి, పెండెం రాములు, బాల ముకుందం, కోల శ్రీనివాస్, శేఖర్ గౌడ్, పలు శాఖల అధికారులున్నారు.