24-05-2025 12:29:30 AM
కోదాడ మే 23: పట్టణానికి చెందిన రమాదేవి అనే మహిళ శరత్ బాబు అనే వ్యక్తికి నాలుగు లక్షలు ఇవ్వాల్సి ఉంది. నాలుగు లక్షలు డబ్బులు లేకపోవడంతో సంతకం చేసి చెక్కు ఇచ్చింది. శరత్ బాబు అనే వ్యక్తి చెక్కు పోగొట్టుకొని గత రెండు రోజులుగా బాధపడుతున్నాడు.
ఇదే తరుణంలో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు గుండా మధుసూదన్ రావు, వెంకన్న అనే ఇద్దరు వ్యక్తులకు కోదాడ పట్టణంలో ఖాతాదారురాలి సంతకంతో కూడి ఉన్న నాలుగు లక్షల విలువ చేసి చెక్కు దొరికింది. ఆ చెక్కు బ్యాంక్ ఆఫ్ బరోడా కు చెందిన కావడంతో ఆ బ్యాంకు కి వెళ్లి బాధితురాలు వివరాలు తీసుకొని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి చెక్కు అందించారు. దీంతో ఆర్మీ ఉద్యోగులను పట్టణవాసులు అభినందిస్తున్నారు