calender_icon.png 2 May, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సభకు ఆహ్వానిస్తూ గోడలపై స్టిక్కర్లు

26-04-2025 12:25:33 AM

అర్మూర్, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి) : వరంగల్ లో ఆదివారం జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలను, ప్రజలను  ఆహ్వానిస్తూ ఆర్మూర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి శుక్రవారం స్టిక్కర్లు అంటించారు. ఈ సంద ర్భంగా బీఆర్‌ఎస్ రజతోత్స వాలను జయప్రదం చేయాలని కోరుతూ ఆయన వాల్ పెయిం టింగ్  కూడా వేశారు. ముఖ్యంగా ’రేవంత్ గోబ్యాక్-కేసీఆర్ కమ్ బ్యాక్ ’అని గోడరాతలు రాసి బీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ నింపారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బీఆర్‌ఎస్ 25వ ఆవిర్భావ సభకు నాయకులు, కార్యకర్తలు ఇంటికొక్కరు తరలి రావాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ సభ కోసం ఎంత మంది తరలివెళ్తున్నారనే విషయమై ఆరా తీస్తున్న నిఘావర్గాలే ప్రజాస్పందన చూసి నిర్ఘాంత పోతున్నాయని అన్నారు.

గ్రామాలవారీగా ప్రతీ రోజు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ సభకు సంబంధించిన లెక్కలు తెప్పించు కుంటున్నట్టు తెలిసిందని అన్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా నుంచి ఎన్ని బస్సులు, ఎన్ని కార్లు సభ కోసం సిద్ధమవు తున్నాయి? ఎంత మంది వెళ్లే అవకాశం ఉన్నది? అంటూ ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఏం నివేదికలు ఇవ్వాలో నిఘావర్గాలకు బోధ పడటం లేదని అన్నారు.