calender_icon.png 23 August, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామోజీ ఫిలింసిటీ అక్రమ ఆగడాలను అడ్డుకోండి

23-08-2025 12:47:54 AM

సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య

అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 22: రామోజీ ఫిలింసిటీ యజమాన్య అక్రమ ఆగడాలను అడ్డుకోవాలని సీపీఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. వేముల కత్వా, ఇందిరా సాగర్, పటేల్ కుంట, ఎఫ్‌టీఎల్ ప్రాంతాన్ని ఆక్రమించి నిర్మించి భారీ గోడను, ప్రభుత్వ భూములను రక్షించాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు.

అనంతరం మాట్లాడుతూ పగడాల యాదయ్య మాట్లాడుతూ.. వేముల కత్వ, ఎఫ్‌టీఎల్ నుంచి భారీగా గోడ నిర్మించి కత్వాను ఆక్రమించి.. పటేల్ కుంటను, ఎఫ్‌టీఎల్ బప్పర్ జోన్‌లో భారీగా రోడ్డు వేశారని... అందులోనే మెయిన్ గేట్ వస్తుందన్నారు. ఫిలిం సిటీ యజమాన్యం అక్రమ ఆగడాలను అడ్డుకునే వారు లేకుండాపోయారన్నారు. సర్వే నెంబర్ 307లో ఉన్న 60 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటుంది. అందులో 20 ఎకరాల వరకు ఉషోదయ ఎంటర్ ప్రైజేస్ పేరుతో ఉంది.

అనాజ్‌పూర్ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 301లో ఎస్పీ సామాజిక వర్గానికి చెందిన భూమి 6 ఎకరాలు పట్టాల ఇవ్వడం జరిగిందన్నారు. ఈ భూమిని కూడా ఆక్రమించారని.. కోర్ట్ ఆర్డర్ అడ్డుపెట్టుకొని ఫిలింసిటీ ఆధీనంలోనే ఉంచుకున్నారన్నారు. అదే విధంగా సర్వే నెంబర్ 251లో 10 ఎకరాలకు ఆక్రమణకు గురైందన్నారు. అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన చెరువుల అనాజ్‌పూర్‌కే కాకుండా..చెరువు కింద ఉన్న 10 గ్రామాలకు చెందిన వెయ్యి ఎకరాల సాగునీరును అందింస్తున్నారు.

ఈ జీవనాధులను కబ్జాదారుల నుంచి రక్షించి చెరువులను పరిరక్షించాలని, ఇరిగేషన్ అధికారులకు తెలియజేసిన్నప్పటికీ.. కబ్జాలకు గురవుతున్న స్పందించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో సీపీఎం అబ్దుల్లాపూర్‌మెట్ మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా, వరకాల ముత్యాలు, మహేష్, బాలరాజ్, కావాలి రాములు, మల్లయ్య, ఇంజముర్ రవి వెంకటేశ్ తదితరులుపాల్గొన్నారు.